LIC జీవితాంతం రిటన్స్ ఇచ్చేలా ఓ పాలసీని ప్రవేశపెట్టింది. పొదుపు+ బీమాతో పాటు గ్యారెంటీ రిటన్స్ ఇచ్చేలా జీవన్ ఉత్సవ్ అనే పాలసీని అందుబాటులోకి తెచ్చింది. 90 రోజుల చిన్నారుల నుంచి 65 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరైనా ఈ పాలసీలో చేరొచ్చు. ఇందులో కనీస బీమా రూ.5 లక్షలు తీసుకోవాల్సి ఉంటుంది. వెయిటింగ్ పీరియడ్ తర్వాత బీమా మొత్తంలో ఏటా 10 శాతం చొప్పున జీవితాంతం ఆదాయం వస్తుంది. అలాగే జీవించి ఉన్నంత కాలం ఇన్సూరెన్స్ హామీ కూడా ఉంటుంది.