గడ్డిఅన్నారం డివిజన్ లోని శ్రీకృష్ణ నగర్, శ్రీనగర్ కాలనీ వద్ద తర్చు డ్రైనేజీ సమస్యతో కాలనీ వాసులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని కార్పొరేటర్ బద్దం ప్రేమ్ మహేశ్వర్ రెడ్డి మంగళవారం ఉదయం జలమండలి సిబ్బందితో పర్యటించారు. కార్పొరేటర్ కాలనీలోని డ్రైనేజీ సమస్యను కాలనీవాసులను అడిగి తెలుసుకున్నారు. డ్రైనేజీ పొంగి పొర్లి రోడ్డుపై పారుతోందని, దీంతో కాలనీవాసులు, వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నారు.