సీఎంఆర్ఎఫ్ ఎంతో మంది పేద ప్రజల ప్రాణాలను కాపాడిందని యాకుత్ పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ అన్నారు. శనివారం తన క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును ఎమ్మెల్యే అందజేశారు. అనంతరం మాట్లాడుతూ సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పోరేట్ స్థాయి వైద్య సేవలను ఉచితంగా పొందేందుకు సహాయపడుతుందన్నారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుని సద్వినియోగం చేసుకోవాలన్నారు.