పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి వరంగల్ హైవే మెయిన్ రోడ్డు పిల్లర్ నంబర్ 106 వద్ద ఉన్న శ్రీ రాఘవేంద్ర హోటల్లో శుక్రవారం దోశ ఆర్డర్ ఇవ్వగా దోశలో కాలిపోయిన బొద్దింక వచ్చిందని బాధితుడు తెలిపారు. దానిని చూసి ఆశ్చర్యానికి గురైన బాధితుడు హోటల్ యజమాని
దృష్టికి తీసుకెళ్లాగ హోటల్ యజమాని దానిని తేలికగా తీసివేశాడని ఆరోపించారు. హోటల్ యాజమాన్యంపై అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరారు.