రామంతపూర్ లోని బాలకృష్ణ నగర్, వెంకట సాయి నగర్, శ్రీనగర్ కాలనీ, కామాక్షిపురం, రాంశంకర్ నగర్ లో కొత్త సివరేజ్ పనులను అత్యవసరంగా ప్రారంభించాలని డివిజన్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు జలమండలి ఎండి సుదర్శన్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. ఎండి స్పందిస్తూ అధికారులను వెంటనే ఇన్స్పెక్షన్స్ కు పంపించి అవసరం ఉన్న చోట ఒక ప్రణాళిక బద్ధంగా పని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని ఆమె తెలిపారు.