గ్రేటర్ పరిధిలో 30 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఉప్పల్ పరిధి రామంతపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన వనమహోత్సవం కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆమ్రపాలి, స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని మొక్కలు నాటారు.