రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమీషన్ ఏర్పాటు చేసింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి బూసని వెంకటేశ్వరరావును చైర్మన్ గా నియమించింది. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ ఖరారు చేయడానికి, బీసీల వెనుకబాటుతనం, స్వభావం, సామాజిక, ఆర్థిక, విద్య, లోతైన సమకాలీన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. నెల రోజులలో సమగ్ర నివేదిక రూపకల్పన చేసి ప్రభుత్వానికి అందించాలని కోరారు.