షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేటలో ఆదివారం రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి చెందాడు.స్థానికుల ప్రకారం.. భోధునంపల్లికి చెందిన బండ రాంరెడ్డి అనే వ్యక్తి మద్యం దుకాణం సమీపంలో రోడ్డు దాటుతుండగా అటువైపు నుంచి వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో గాయాల పాలయ్యాడు. దీంతో అతనిని 108లో షాద్నగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.