రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ రాగం

169பார்த்தது
శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని శేరిలింగంపల్లి డివిజన్ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని‌ నల్లగండ్ల‌ బ్రిడ్జి సమీపంలో చేపట్టిన సీసీ రోడ్డు పనులను కార్పొరేటర్ రా‌గం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పనులను పూర్తి చేయాలని‌ కాంట్రాక్టర్ కు ఆదేశించారు. దశల వారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ చెప్పారు.

டேக்ஸ் :

Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி