చంచల్గూడ జైలు నుంచి బిజెపి నాయకులు విడుదల
సికింద్రాబాద్ కుమ్మరిగూడలోని శ్రీ ముత్యాలమ్మ గుడి వద్ద ఆందోళన చేసిన కేసులో బీజేపీ నాయకులు, హిందూ సంఘాల నేతలకు బెయిలు మంజూరైంది. చంచల్గూడ జైలు నుంచి శనివారం సాయత్రం విడుదల అయ్యారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు, మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక ఘన స్వాగతం పలికారు. అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులపై చర్యలు తీసుకోవాల్సింది పోయి. అన్యాయంగా తమపై కేసుకు పెట్టారని ఆరోపించారు.