సికింద్రాబాద్: గాంధీ ఆవరణంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం

83பார்த்தது
సికింద్రాబాద్: గాంధీ ఆవరణంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం
సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రిలో మరో గుర్తుతెలియని డెడ్ బాడీ మంగళవారం వెలుగు చూసింది. వెయిటింగ్ హాల్లో కింద పడి ఉన్న 30 నుంచి 35 ఏళ్ల వయసు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి డెడ్ బాడీని చూసిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. డెడ్ బాడీ వద్ద ఎలాంటి వివరాలు లేకపోవడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఫొటోలోని వ్యక్తిని గుర్తుపట్టిన వారు చిలకలగూడ పీఎస్ లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

தொடர்புடைய செய்தி