సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో మొబైల్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. అతని నుంచి రూ. 45, 988 విలువ చేసే మొబైల్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో నిద్రిస్తున్న వారు, ఒంటరిగా ఉన్నవారు, వృద్ధులు, యువతులను టార్గెట్ చేసి మొబైల్ దొంగతనాలు చేస్తున్నట్లు గుర్తించారు.