మెట్టుగూడ పరిధి చిలకలగూడ కట్టమైసమ్మ ఆలయానికి ఎదురుగా ఉన్న బస్తీ వాసులకు కరెంట్ స్తంభం వద్ద షాక్ కొడుతోంది. శనివారం డివిజన్ కార్పొరేటర్ రసూరి సునీత అధికారులతో కలిసి వెళ్లి సమస్యను పరిష్కరించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే డ్రైనేజ్ సమస్యల గురించి బస్తీ వాసులు దృష్టిలోకి తేవడంతో వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.