అతడో నరరూప రాక్షసుడు. తన వైకల్యాన్ని అవకాశంగా మలచుకొని దోపిడీలు, దొంగతనాలు, అత్యాచారాలు, హత్యలకు తెగబడ్డాడు. జైలు నుంచి విడుదలైన 11 రోజుల వ్యవధిలోనే వివిధ ప్రాంతాల్లో 5 హత్యలకు పాల్పడినట్టు గుజరాత్ పోలీసులు నిర్దారించారు. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ అలియాస్ భోలు కర్మవీర్ ఈశ్వర్ జాట్ అరాచకానికి యాదగిరిగుట్ట రైల్వేస్టేషన్ లో తెలుగు మహిళ రమణమ్మ బలయ్యారు. ఆమెను హత్య చేశాడు.