సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ మొదటి సంవత్సర పరీక్షల్లో 94% మంది విద్యార్థులు పాసయ్యారని ప్రిన్సిపల్ డా. ఇందిర గురువారం తెలిపారు. మొత్తం 250 మంది పరీక్షలకు హాజరు కాగా, 235 మంది పాస్ అయ్యారని, అందులో 24 మంది డిస్టింక్షన్ సాధించడం ఆనందంగా ఉన్నదన్నారు. 159 మంది ఫస్ట్ క్లాస్, 52 మంది సెకండ్ క్లాస్లో పాసయ్యారని చెప్పారు. ఫెయిల్ అయిన వారికి నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయన్నారు.