సమస్యలను పరిష్కరించడం ద్వారా ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాన్ని దూరం చేయాలని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బన్సీలాల్‌పేట డివిజన్లోని గొల్ల కొమురయ్య కాలనీలోని మెయిన్ రోడ్‌పై జరుగుతున్న అభివృద్ధి పనులను అధికారులతో కలిసి సోమవారం పరిశీలించారు. గతంలో ఈ రోడ్డు ఎప్పుడు మురుగునీటితో నిండి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారని పేర్కొన్నారు. ప్రస్తుత సమస్యను పరిష్కరిస్తామన్నారు.