భక్తిశ్రద్ధలతో దుర్గ దేవి నవరాత్రి ఉత్సవాలను జరుపుకోవాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచించారు. శనివారం లాలాపేటలోని కనకదుర్గ ఆలయాన్ని ఎమ్మెల్యే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పూజారులు ఎమ్మెల్యేని ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.