తెలుగుదేశం పార్టీ సభ్యత్వం రాష్ట్రంలో విజయవంతంగా సాగుతుందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో భాగంగా ఆయన సికింద్రాబాద్ నియోజకవర్గం బౌద్ధనగర్ లో శనివారం పర్యటించారు. ప్రజల్లో టిడిపికి ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదన్నారు. సీనియర్ నాయకుడు వల్లారపు శ్రీనివాస్, జీవీ కృష్ణ, చిరంజీవి, రాజు, శశిరేఖ, కట్ట రాములు ఉన్నారు.