బేగంపేటలోని ప్యారడైజ్ హోటల్లో పాడైన హలీం అమ్ముతున్నట్లు వచ్చిన ఆరోపణల మేరకు అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ, జీహెచ్ఎంసీ అధికారులు తనిఖీలు చేశారు. తనిఖీల అనంతరం శాంపిల్స్ స్వీకరించి ప్రత్యేక ల్యాబ్ వద్దకు పంపించినట్లు పేర్కొన్నారు. రిపోర్టు వచ్చిన తర్వాత, రిపోర్టు ప్రకారంగా చర్యలు తీసుకుంటామని సోషల్ మీడియా వేదికగా తెలిపారు.