కుత్బుల్లాపూర్ నియోజక వర్గం పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని లింకు రోడ్ల పనులపై ఎమ్మెల్యే కే పి. వివేకానంద హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్ ఆర్ డీ సీ ఎల్), జీహెచ్ఎంసీ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లింకు రోడ్ల అభివృద్ధితో ట్రాఫిక్ రద్దీ తగ్గడంతోపాటు దూరం తగ్గుతుందన్నారు.