జగద్గిరిగుట్ట డివిజన్ షిర్డీ హిల్స్ కాలనీ నూతన సంక్షేమ సంఘం అధ్యక్షులు బండ మహేందర్, కోశాధికారి కె. వినోద్ యాదవ్ లు కుత్బుల్లాపూర్ లో ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బుధవారం బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమ సంఘాలు ప్రజాప్రతినిధులకు, కాలనీవాసులకు నిత్యం అందుబాటులో ఉండి అభివృద్ధికి వారధులుగా నిలవాలన్నారు.