బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే

77பார்த்தது
బతుకమ్మ వేడుకల పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే
తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా నిజాంపేట్ లోని శ్రీనివాస్ నగర్ నందు "స్ఫూర్తి ఉమెన్స్ గ్రూప్" ఆధ్వర్యంలో ప్రతీ యేటా నిర్వహించే బతుకమ్మ వేడుకల పోస్టర్ ను ఆదివారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి. వివేకానంద్, నిజాంపేట్ కార్పొరేటర్ రాఘవేందర్ రావు తో కలిసి ఆవిష్కరించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి. వివేకానంద్ మాట్లాడుతూ పువ్వులలో అమ్మవారిని చూస్తూ మహిళలంతా ఒకదగ్గర చేరి ఐకమత్యంగా ఆటలాడుతూ అమ్మవారిని కొలుస్తూ ఆడిపాడే వేడుక బతుకమ్మ అని అన్నారు.

தொடர்புடைய செய்தி