హైదరాబాద్కు మూసీ బ్యూటిఫికేషన్ అవసరమేనని, కానీ పేదల ఇండ్లను తొలగించకుండా చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇవాళ ముషీరాబాద్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను కిషన్ రెడ్డి శంకుస్థాపనలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదేపదే.. రూ.లక్షన్నర కోట్లతో మూసీ నది బ్యూటిఫికేషన్ చేస్తామని అంటున్నారని, ముందు బస్తీల్లో డ్రైనేజీ సమస్యను పరిష్కారం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.