మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలోని పూడూరు సొసైటీ కేంద్రంలో శుక్రవారం ధాన్యం కోనుగోలు కేంద్రాన్నిఅధికారులు, చైర్మన్లు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వరికి నిర్ణయించిన మద్దతు ధర ఏ గ్రేడ్ వరికి 2320/- రూపాయలు కామన్, సన్నరకముకు 2300, ప్రభుత్వం ప్రకటించిన బోనస్ 500 రూపాయలు ఇవ్వబడుతుందని అధికారులు తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, చైర్మన్, వైస్ చైర్మన్, రైతులు తదితరులు పాల్గొన్నారు.