తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిల్లా శ్రీధర్ బాబుని ఆయన నివాసంలో కలిసి ఘట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలోని గురుకుల కళాశాల మైదానం 26 ఎకరాల భూమికి రక్షణ కల్పిస్తూ కేజి టూ పీజీ కళాశాల ఏర్పాటు చేయాలని కోరుతూ మాజీ చైర్పర్సన్ ముల్లి పావని జంగయ్య యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కడుపోలా మల్లేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొక్క సంజీవ్ రెడ్డి, నాయకులు కడుపోలా రాజు, తదితరులు పాల్గొన్నారు.