మేడ్చల్ జిల్లా పోచారం ఐటి కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధి రాంపల్లిలో బావ సయ్యద్ ఆలీపై బామ్మర్డి జాఫర్ ఆలీ తన వెంట వచ్చిన ఇద్దరు స్నేహితులతో కలిసి కత్తులతో దాడి చేశాడు. సయ్యద్ ఆలీకి కడుపులో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సయ్యద్ ఆలీకి అతని భార్య రుక్సాన మధ్య కుటుంబ గొడవలు జరుగుతున్నాయి.