మూడుచింతలపల్లి మండలంలోని ఉద్దేమర్రి గ్రామంలో సోమవారం తహసీల్దార్ వెంకట నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పౌర హక్కుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ నాగజ్యోతి మాట్లాడుతూ రాజ్యాంగ ద్వారా కల్పించిన పౌర హక్కులపై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ తమ హక్కులను సాధనకు కృషి చేయాలని ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు నేతలు, ప్రజలను ఎల్లప్పుడూ చైతన్యవంతులను చేయాలన్నారు.