మల్కాజ్ గిరి: ప్రజావాణిలో ఇచ్చిన పిర్యాదులకు అధికారులు స్పందించడం లేదు
జిహెచ్ఎంసి మల్కాజ్ గిరి సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి అందించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని డిసీ రాజు ఆయా విభాగాల అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో 9 ఫిర్యాదులు అందాయని వీటిలో టౌన్ ప్లానింగ్, డ్రైనేజీ, ఇంజనీరింగ్ సమస్యలపై పిర్యాదులు అందాయని అయన తెలిపారు. ప్రజావాణిలో ఇచ్చిన పిర్యాదులకు అధికారులు స్పందించడం లేదని కార్పొరేటర్ శ్రావణ్ డీసీ రాజుకు పిర్యాదు చేశారు.