ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా, మల్కాజిగిరి ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, శుక్రవారం మల్కాజిగిరి క్యాంప్ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తల మధ్యలో కేక్ కటింగ్ చేసి, జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు, ఆశా వర్కర్లకు చీరల పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ప్రేమ్ కుమార్, రాజ్ జితేందర్ నాథ్, నిరంజన్, సతీష్ కుమార్, లక్ష్మీకాంత్ రెడ్డి, వరుణ్ తదితరులు పాల్గొన్నారు