అల్వాల్ డివిజన్ పరిధిలోని ఇందిరానగర్, చంద్రపురి కాలనీలో సిమెంట్ రోడ్లను మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ శాంతి శ్రీనివాసులు రెడ్డితో కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మల్కాజిగిరి పరిధిలోని అన్ని డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నంది కంటి శ్రీధర్ పాల్గొన్నారు.