చిరు వ్యాపారులను బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నేరెడ్మెట్ సీఐ సందీప్ కుమార్ సోమవారం హెచ్చరించారు. నేరెడ్మెట్ పరిసర ప్రాంతాల్లో స్థానిక వ్యాపారులను తరచూ కొందరు బెదిరించి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. బలవంతంగా వసూలు చేసే వారి వివరాలు ఉంటే నిర్భయంగా తనకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.