జవహర్ నగర్లోని చెన్నాపురం చౌరస్తా నుంచి బి జె ఆర్ నగర్ వరకు 100 ఫీట్స్ రోడ్డు విస్తరణలో భూములు నష్టపోయిన బాధితులను మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ శనివారం పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. జవహర్ న గర్ మొత్తం ప్రభుత్వ పరమైన భూమి అని అక్రమంగా గుడిసెలు, రేకుల షెడ్లు వేసుకున్నారనడం తప్పని అన్నారు. ఇవి ఆనాడు ఎక్స్ సర్వీస్ మెన్కు ఇచ్చిన భూములు తప్ప ప్రభుత్వ పరమైన భూములు కావని తెలిపారు.