మల్కాజిగిరి: శ్రీసాయి నగర్ కాలనీ సమస్యలు పరిష్కరిస్తాం
నియోజకవర్గ సమస్యలు పరిష్కరించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తానని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం వినాయకనగర్ డివిజన్ పరిధి శ్రీసాయినగర్ కాలనీ వాసులు ఎమ్మెల్యేని కలిశారు. 3 ఫేస్ విద్యుత్ సరఫరా, కరెంట్ స్తంభాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.