మల్కాజ్‌గిరి మారుతి నగర్ లోని శివాజీ పార్క్ లో బోర్ సదుపాయం ఏర్పాటు చేసేందుకు జియోలోజిస్ట్ ద్వారా కార్పొరేటర్ శ్రవణ్ గురువారం సర్వే చేయించడం జరిగింది. ఈ సర్వే లో రెండు పాయింట్స్ ను గుర్తించడం జరిగింది. ఈ సందర్బంగా శివాజీ పార్క్ ను మరింత అభివృద్ధి చేస్తామని శ్రవణ్ అన్నారు. పార్క్ గోడల పైన అస్టేటిక్ పెయింట్స్ ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమం లో జియోలోజిస్ట్ లు, మాజీ కౌన్సిలర్, తదితరులు పాల్గొన్నారు.