మల్కాజ్ గిరి నియోజకవర్గ పరిధిలో ముఖ్యమంత్రి సహాయ నిధి(సీఎంఆర్ఎఫ్) కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బుధవారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి లబ్ధిదారుల కుటుంబ సభ్యులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.