ఇంట్లో నుండి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన ఘటన నాగోలు పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. బండ్లగూడ ఇందు అరణ్య అపార్ట్మెంట్ లో నివాసముండే సంకేపల్లి నిహారిక ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. ఈ నెల 5న ఇంట్లో ఎవరికి చెప్పకుండా బయటకు వెళ్లి రాత్రైనా రాలేదు. కుటుంబ సభ్యులు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వచ్చింది. స్నేహితులు, బంధువులతో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు.