హైదరాబాద్ నగరంలో గతేడాదితో పోలిస్తే ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరిగాయని నైట్ ఫ్రాంక్ నివేదిక వెల్లడించినట్లు హెచ్ఎండిఏ ట్వీట్ చేసింది. గతేడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ సంవత్సరం 14 శాతం ఎక్కువగా రిజిస్ట్రేషన్లు ఎక్కువ అయ్యాయని పేర్కొంది. రూ. 50 లక్షలలోపు ఇళ్ల కొనుగోలుకు ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, రూ. కోటి కంటే ఎక్కువ విలువైన ఇళ్ల రిజిస్ట్రేషన్లలో 36 శాతం వృద్ధి నమోదు అయినట్లు శనివారం తెలిపింది.