ఖైరతాబాద్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్(ఎస్ డబ్ల్యూ ఎం)కోసం ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)ని ప్రవేశపెట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి తెలిపారు. బుధవారం 11 మంది ఆపరేటర్లతో సమావేశం నిర్వహించారు. జీహెచ్ఎంసీ వ్యర్థ పదార్థాల నిర్వహణ వ్యవస్థను ప్రపంచ ప్రమాణాలకు పెంచడానికి చురుకైన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగా ఆపరేటర్లు అందించిన వినూత్న సాంకేతికతలను సమావేశంలో పరిశీలించారు.