కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ శారదకు బీజేపీ మహిళా నేతలు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని.. తక్షణమే ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. 'సినిమాల్లో పిచ్చి వేషాలు వేసుకునే కంగనా రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదు' అంటూ దానం నాగేందర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.