గ్రేటర్ హైదరాబాద్ నగరంలో నిన్నటి నుంచి వర్షాలు కురుస్తున్నాయని, ఎక్కడ సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదివారం తెలిపారు. నగరానికి రేపు కూడా భారీ వర్ష సూచన ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ప్రజలకు అత్యవసర సేవలకై 040-21111111 లేదా స్థానిక జీహెచ్ఎంసీ అధికారులకు సంప్రదించాలని సూచించారు.