వెంగళరావునగర్‌లోని డీసీఏ ఆఫీసులో మంగళవారం ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష సమావేశం నిర్వహించారు. నాసిరకం, నకిలీ మెడిసిన్ తయారు చేసే వారిపై, వాటిని అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు. ఫార్మా ఇండస్ట్రీస్, డ్రగ్ మానుపాక్చరింగ్ యూనిట్స్, మెడికల్ హాల్స్, ఫార్మసీలలో మరింత విస్తృతంగా తనిఖీ చేయాలని సూచించారు.