నేటి నుంచి ఎస్సీ వర్గీకరణ అమలు కానుంది. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజును వర్గీకరణ అమలు తేదీగా పేర్కొంటూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయనుంది. ఉత్తర్వుల తొలి కాపీని సీఎం రేవంత్‌రెడ్డికి అందజేయనున్నారు. కాగా వర్గీకరణపై జస్టిస్ షమీమ్ అక్తర్ కమిషన్ 199 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఇందులో 59 కులాలపై వివరణాత్మక చర్చను పొందుపరిచింది.