తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో శుక్రవారం హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యారంగ సమస్యలు, విశ్వవిద్యాలయాల అభివృద్ధిపై చర్చ జరిగింది. ప్రభుత్వ సలహాదారులు కే. కేశవరావు, వేం. నరేందర్ రెడ్డి, శ్రీనివాసరాజు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టా రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.