బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లో ఉన్న ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ సువర్ణభూమి కార్యాలయంలో బాధితులు శనివారం ఆందోళనకు దిగారు. బై బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట ఒక్కొక్కరి వద్ద రూ. 30 లక్షల నుంచి కోటి వరకు సువర్ణ భూమి వారు వసూలు చేశారని బాధితులు ఆరోపించారు. ఏడాదిన్నర తరువాత ఇన్వెస్ట్మెంట్ పై అధిక వడ్డీ చెల్లిస్తామని సంస్థ ఎండీ శ్రీధర్ తెలిపారని అన్నారు. డబ్బులు ఇస్తామని పిలిచి బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు.