బీసీ కమిషన్ చైర్మన్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు

83பார்த்தது
బీసీ కమిషన్ చైర్మన్ కు ఎమ్మెల్యే శుభాకాంక్షలు
బీసీ కమిషన్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు జి. నిరంజన్ సోమవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చైర్మన్ నిరంజన్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలో కష్టపడే వారికే తగిన పదవులు లభిస్తాయన్నారు. అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నెరవేర్చాలని, పార్టీ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని చైర్మన్ కు ఎమ్మెల్యే సూచించారు.

தொடர்புடைய செய்தி