మొఘల్‌పురా డివిజన్ పరిధిలోని జహంగీర్ నగర్ లో యాకుత్‌పురా ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్ మిరాజ్ శుక్రవారం నమాజ్ అనంతరం మొఘల్‌పురా డివిజన్లోని ప్రజలను కలిసి డివిజన్ లో సమస్యలకై మరియు ఇతర సమస్యలపై ప్రజలతో సామరస్యంగా మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని వీలైనంత త్వరగా డివిజన్లో మరియు నియోజకవర్గంలో సమస్యలను ఒకటి ఒకటిగా పూర్తి చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.