కార్మికమంత్రి చామకూర మళ్ళారెడ్డి ని క్యాబ్ సంఘాలు కలువడం జరిగింది. ప్రతీ సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ట్రాన్స్పోర్ట్ డ్రైవర్లకు ఆక్సిడెంట్ ఇన్సూరెన్స్ 500000/-పాలసిని తిరిగి పునరుద్దరించాలని తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతూ జాయింట్ యాక్షన్ కమిటీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి సానుకూలంగా స్పంసించినందుకు జెఎసి నాయకులు కార్మిక మంత్రి మాల్లారెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జెఎసి చైర్మన్ షైక్ సల్లాఉద్దీన్, టీఆర్ సీపీటీయూ వర్క్ ప్రెసిడెంట్ సత్యనారాయణ రెడ్డి, టీఆర్ఎస్ కెవి క్యాబ్ సెక్టర్ ప్రెసిడెంట్ నాగేష్,టీఎస్ సీపీయే ప్రెసిడెంట్ సత్యనారాయణ పాల్గొన్నారు.