తెలంగాణ రాష్ట్రంలో టాక్సీ డ్రైవర్ల పక్షాన నిలబడుతూ మొట్టమొదటి ట్రేడ్ యూనియన్ కార్మిక చట్టం 1926 ప్రకారం రిజిస్ట్రేషన్ ఐన సందర్బంగా రాష్ట్ర అధ్యక్షలు కె.సతీష్ మాట్లాడుతూ... డ్రైవర్ కార్మిల కోసం ఇప్పటివరకు ట్రేడ్ యూనియన్ లేదని ఈ తెలంగాణ రాష్ట్ర క్యాబ్స్ ప్రొటెక్ట్ ట్రేడ్ (TR CPTU )మొదటిదని, ఈ ట్రేడ్ యూనియన్ ద్వారా సాటి డ్రైవర్ సోదరులకు అండగా ఉంటూ స్థానికంగా మరియు తెలంగాణలో, ఎటువంటి సమస్యలు ఉన్నా టిఆర్ సిపిటియు ద్వారా పరిష్కారం దిశలో పనిచేస్తుందని, మరియు ప్రభుత్వాలకు సహకరిస్తూ తగు న్యాయంకోసం ముందుంటుందని తెలుపడం జరిగింది.
ముఖ్యంగా ఈరోజు డ్రైవర్లు అనేక బాధల్లో ఉన్నారని, డ్రైవర్లకు ప్రభుత్వంచేత ఒక సంక్షేమ బోర్డు ఏర్పాటుకు ప్రయత్నం చేస్తామని, సమాజంలో ఒక గుర్తింపు లేకుండా బతుకుతున్న డ్రైవరన్నకు ఒక గుర్తింపు తెచ్చే ప్రయత్నం చేస్తామని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్రైవర్ సోదరులను ఓకే చెట్టుకిందకి తీసుకొచ్చి ఐక్యత చేస్తామని, వృత్తి పరంగా డ్రైవర్ కు ఎం జరిగిన తన కుటుంబం రోడ్డున పడే అవకాశం ఉన్నందున వారికుటుంబానికి ఒక ట్రేడ్ యూనియన్ గా ఆడుకుంటామని, త్వరలోనే ఐజ్యత కోసం గ్రామ కమిటీలు, మండల కమిటీలు, జిల్లా కమిటీలు కూడా ఏర్పాటు చేశి రాష్ట్ర కమిటీ నుంచి గ్రామ కమిటీల వరకు అనుసంధానంగా పని చేసి ఒక్కటవుతామని తెలుపడం జరిగింది.
అంతే కాకుండా ఒక డ్రైవర్ ఏ ప్రాంతంలో ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా అక్కడి డ్రైవర్ సోదరులతో సహాయం అందేలా చూస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొంతమంది కార్ మెకానిక్ లతో మాట్లాడి సహాయం అడిగిన వెంటనే స్పందించేలా టిఆర్ సిపిటియు మెకానిక్ యూనిటీని కూడా తయారు చేస్తాం అని తెలుపుతూ, డ్రైవర్ ఎటువంటి ఆపదలో ఉన్నా తోటి డ్రైవర్ల కోసం టిఆర్ సిపిటియు బ్లడ్ డొనర్స్ సంస్థను ఏర్పాటు చేసి ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తామని,రాబోయే రోజుల్లో ప్రభుత్వాలకు సహకరిస్తూ ప్రభుత్వం నియమాలు పాటిస్తూ ఒక పటిష్టమైన వ్యవస్థను స్థాపిస్తామని తెలుపడం జరిగింది.
ఈ నూతన ట్రేడ్ యూనియన్ స్థాపన కార్యక్రమంలో సిఐటియు సిటీ ఇంచార్జి అజయ్ బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయి బన్న ,యండి ఆఫ్జల్, ప్రధాన కార్యదర్శి డి.సోమాజీ, హైదరాబాద్ నగర్ అధ్యక్షులు ఎ.బాల్ రెడ్డి నగర ప్రధాన కార్యదర్శి హరి కృష్ణా, గౌరవ అధ్యక్షులు కె.రమేష్, సిహెచ్. పవన్ పాల్గోన్నారు.