పురాతత్వ శాస్త్రవేత్తల తవ్వకాల్లో ఓ మానవ ఎముక బయటపడిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. మానవ ఎముకే కదా అందులో కొత్తేముంది అనుకుంటున్నారా? ఆ ఎముకను దగ్గరగా పరిశీలించగా మోకాలి వద్ద ఓ గుండ్రటి ఇనుప వస్తువు కనిపించింది. చివరికి అది మోకాలి ఆపరేషన్‌లో అమర్చే కీలు అని తెలిసింది. అయితే ఎముక కుళ్లిపోయిన అది ఇప్పటికి చెక్కుచెదరకుండా ఉంది. ఈ వీడియో ప్రస్తుతం 19.6 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.