విశాఖలో హనీ ట్రాప్.. కీలక విషయాలు వెల్లడించిన CP శంకబ్రతా (వీడియో)

64பார்த்தது
ఏపీలోని విశాఖపట్నంలో హనీ ట్రాప్ ఉదంతం వెలుగులోకి వచ్చింది. జాయ్ జెమీమా అనే యువతి NRIలు, సంపన్న యువకులను టార్గెట్ చేసి హనీ ట్రాప్ చేస్తోందని వైజాగ్ CP శంకబ్రతా బాగ్చీ తెలిపారు. వారిని ప్రేమ పేరుతో ముగ్గులోకి దింపి మత్తు పదార్థాలు అలవాటు చేసిందని తెలిపారు. ఈ క్రమంలో న్యూడ్ ఫొటోలు, వీడియోలు రికార్డు చేసి రూ. కోట్లలో డబ్బులు, బంగారం దోచుకుంటోందని చెప్పారు. ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி